Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Chesina Upakaramulaku Nenemi Chelli

నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లి

Neevu Chesina Upakaramulaku Nenemi Chelli

Verse
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును
ఏడాది దూడలనా? వేలాది పొట్టేళ్ళనా?‖ 2x ‖
Verse
వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా‖ 2x ‖
గర్భఫలమైన నాజేష్ట పుత్రుని నీకిచ్చినా చాలునా‖ 2x ‖
Verse
మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో‖ 2x ‖
కరుణ జూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా‖ 2x ‖
Verse
విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును‖ 2x ‖
రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను‖ 2x ‖
Verse
ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును?‖ 2x ‖
కపట నటనాలు చాలించి నిత్యము నిను వెంబడించెదను‖ 2x ‖

Related Tags

WorshipSalvationGratitude