Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Denini Vedakuchunnavu Ee Paapalokamu Nandu Vinu Yesuni Swaramunu

నీవు దేనిని వెదకుచున్నావు ఈ పాపలోకము నందు విను యేసుని స్వరమును

Neevu Denini Vedakuchunnavu Ee Paapalokamu Nandu Vinu Yesuni Swaramunu

Chorus
నీవు దేనిని వెదకుచున్నావు - ఈ పాపలోకము నందు
విను యేసుని స్వరమును
Verse
ఈ సూర్యుని క్రింద నీవు - బుద్ధి జ్ఞానము వెదకుచున్నావు
ఆనంద ధన ఘనతలు - పొందగోరుచునున్నావు
ఇవి యన్నియు వ్యర్థమే ఎరుగు - దుఃఖంబె లోకమంతయును
చింతింతువు ఒకనాడు
Verse
దేవుని రాజ్యము నీతి - వెదకుము నీవు మొదట
బహు చెంతనుండె నీకు - మారు మనస్సు నొందుము నేడె
నూతన జన్మమును పొంది - ప్రవేశించుట అందున
అంగీకరించుము నేడె
Verse
శాశ్వత రాజ్యము పొంద - యోగ్యత అవసరము
ఆత్మలో దీనులు - వారిదే నిత్య రాజ్యం
దుఃఖపడువారును - విరిగిన హృదయులందరును
శాంతి ఆనందం పొందెదరు
Verse
కనికరము గలవారు - హౄదయ శుద్ధి గలవారు
సమాధానపరచువారు - తన పుత్రులవుదురు
హింసను పొందువారు - దీర్ఘ శాంతము గలవారున్
ఆ రాజ్యములో నుందురు

Related Tags

GospelRepentanceSalvation