Verse
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా
నీవు చూడని స్థలమేది యేసయ్యా
కనుమరుగై నేనుండలేనయ్యా‖ 2x ‖
నీవు వినని మనవేది యేసయ్యా
నీవు తీర్చని భాద ఏది యేసయ్యా‖ 2x ‖
నీవుంటే నా వెంట అదియే చాలయ్యా‖ 4x నీవు లేని ‖
Verse
కయీను కౄర పగకు బలియైన హేబేలు
రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు‖ 2x ‖
చెవి యొగ్గి నా మొరను
యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా‖ 2x నీవుంటే ‖
Verse
సౌలు ఈటె దాటికి గురియైన దావీదు
ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును
గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు‖ 2x ‖
నీ తోడు నీ నీడ
యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా‖ 2x నీవుంటే ‖