Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Lenide Nenu Lenu

నీవు లేనిదే నేను లేను

Neevu Lenide Nenu Lenu

Lyricist: G Esther Rani
Verse
నీవు లేనిదే నేను లేను ప్రభువా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా‖ 2x ‖
నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం‖ 2x ‖
మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా‖ 2x ‖
నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము‖ 2x నీవు ‖
Verse
గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళ
తీరాన్ని దాటలేని నావ నేనైన వేళ‖ 2x ‖
నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే‖ 2x ‖
ఆ సిలువే నాకు శరణం
నా పాప పరిహారం‖ 2x నీవు ‖
Verse
అపజయమే నాదు బ్రతుకును విషాదముగా మార్చిన వేళ
జీవించుటకాశ లేక మరణాన్ని కోరిన వేళ‖ 2x ‖
నా ఆశ నీవైతి – ఆ ఆశ సిలువాయే‖ 2x ‖
ఆ సిలువే నాకు నిరతం
నా జీవిత చిరుదీపం‖ 2x నీవు ‖

Related Tags

WorshipDevotionalRepentance