Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Prarthana Chaeyunappudu

నీవు ప్రార్థన చేయునప్పుడు

Neevu Prarthana Chaeyunappudu

Chorus
నీవు ప్రార్థన చేయునప్పుడు
అడుగుచున్న వాటిని
పొందియున్నాననే నమ్మకమున్నదా నీకు‖ 2x ‖
Verse
నమ్మిక లేకయే నీవు చేసే ప్రార్థన
తండ్రి సన్నిధి చేరదని గుర్తెరుగుమా నేడు‖ 2x ‖
నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి అన్నియు
సాధ్యమేనని చెప్పిన మాట మరచితివా‖ 2x ‖
ప్రభు మాట మరచితివా‖ పొందియున్నాననే ‖
Verse
బాధలు ఇబ్బందులు నిన్ను చుట్టిన వేళలో
విశ్వాస ప్రార్థనా బలము మరచితివా‖ 2x ‖
సింహాల బోనులోన ప్రార్థించిన దానియేలు
నమ్మి పొందిన భయము లేని జయము మరచితివా‖ 2x ‖
ఆ జయము మరచితివా‖ పొందియున్నాననే ‖
Verse
గొల్గొతా కొండ మీద కన్నీటి ప్రార్థన
ఆంతర్యమును గ్రహియించుమా నేడు‖ 2x ‖
సొంత చిత్తము కాకయే తండ్రి చిత్తము నెరవేర్చి
ప్రభువు మనకు నొసగెను రక్షణానందం‖ 2x ‖
ఈ రక్షణానందం‖ పొందియున్నాననే ‖

Related Tags

FaithPrayerTrust