Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Thadithe Thalupu

నీవు తడితే తలుపు

Neevu Thadithe Thalupu

Verse
నీవు తడితే తలుపు తీయనా ప్రభు
నాలో నీవుంటే ఇంకేల నాకు భయం‖ 2x Neevu ‖
Verse
పాపముతో నిండియున్న నా బ్రతుకును
పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా
పాపములో జీవించుచున్న నాపై
ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా‖ 2x ‖
నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి
నన్ను నడిపించగ వచ్చావయ్యా‖ 2x Neevu ‖
Verse
తెరిచాను నా తలుపులు రావా ప్రభు
ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను
నాలోన నీవుండి పోవాలి
నీతోనే నడవాలి ఇక మీదట‖ 2x ‖
రక్షణనే కేడెము చేత పట్టి
ప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ పరచెద‖ 2x Neevu ‖
Verse
విలువలేని నన్ను నీవు ఎంచుకొంటివి
వాక్యమనే ధ్యానముతో నన్ను నింపుమా
స్వస్థతనే వరముల దయచేయుమా
కడ వరకు పరుగెడుదును నీ బాటలో‖ 2x ‖
ఎల్లవేళలా నాతో ఉండి నన్ను
చేయి పట్టి నడిపించు నా యేసయ్యా‖ 2x Neevu ‖

Related Tags

WorshipDevotionalSalvation