Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Thappa Naakee Lokamlo

నీవు తప్ప నాకీ లోకంలో

Neevu Thappa Naakee Lokamlo

Lyricist: Mylabatthula Yesu Padam
Verse
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా‖ 2x ‖
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా
నజరేతు వాడా నను విడిచిపోకయ్యా‖ 2x నీవు ‖
Verse
గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా
మూగవాడినయ్యా నా స్వరమునీయవా‖ 2x ‖
కుంటివాడినయ్యా నా తోడు నడువవా‖ 2x దావీదు ‖
Verse
లోకమంత చూచి నను ఏడిపించినా
జాలితో నన్ను చేరదీసిన‖ 2x ‖
ఒంటరినయ్యా నా తోడు నిలువవా‖ 2x దావీదు ‖
Verse
నా తల్లి నన్ను మరచిపోయినా
నా తండ్రి నన్ను విడచిపోయినా‖ 2x ‖
తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా‖ 2x దావీదు ‖

Related Tags

WorshipDevotionalPrayer