Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Thodai Yunnanjalu Yesu Nith

నీవు తోడై యున్నఁజాలు యేసు నిత్

Neevu Thodai Yunnanjalu Yesu Nith

Lyricist: Pulipaka Jagannadhamu
Verse
నీవు తోడై యున్నఁజాలు యేసు నిత్యము నాకది మేలు నీవు
ధరణినుండు నీచపాపుల నెల్లఁగావఁ బ్రేమ వచ్చి ఘన ప్రాణ మిడినట్టి‖ నీవు ‖
Verse
నినుఁ బోలు రక్షకుం డేడి క్రీస్తు ననుఁ బోలు పాతకుం డేడి నిను
నమ్ము వారలకు నీ వొసఁగుచుందువు తనరఁ పాపక్షమ దయచేత
నిలలోన‖ నీవు ‖
Verse
నీ పాటి బలవంతుఁ డేడి ప్రభు నాపాటి దుర్బలుం డేడి కాపాడు
చుందువు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీనేర్పురంజిల్ల‖ నీవు ‖
Verse
నీవంటి యుపకారి యేడి కర్త నావంటి కడు దీనుఁ డేడి జీవుల
కును గల్గు జీవంబు లిచ్చుచు జీవాధారము లొసఁగి జీవులఁ బ్రోచెడి‖ నీవు ‖
Verse
నీవంటి ధనవంతుఁడేడి యేసు నా వంటి ధనహీనుఁ డేడి ప్రోవులై
యున్నవి యీవులు నీయందు నీవువాని నొసంగి నిరతంబు ననుఁ గావు‖ నీవు ‖

Related Tags

GraceSalvationJesusGuidance