Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Thodaiyundagaa

నీవు తోడైయుండగా

Neevu Thodaiyundagaa

Lyricist: Joshua Katta
Verse
నీవు తోడైయుండగా యేసు – భయము లేదు ఇలలో
మేలు చేయు దేవుడా నీకు – సాటి లేరు సృష్టిలో
ఎక్కలేని కొండలెన్నో ఎదురొచ్చిననూ
లెక్కలేని నిందలే నన్ను బాధించిననూ‖ నీవు తోడైయుండగా ‖
Verse
గతం గాయాన్ని చేయగా – గాయం హృదయాన్ని చీల్చగా
శోకం సంద్రంలా ముంచగా – లోకం బంధాలే తెంచగా
పేరు పెట్టి తల్లిలా పిలచి లాలించితివి
నీవే తోడు నీడగా నిలచి కృప చూపితివి‖ నీవు తోడైయుండగా ‖
Verse
ఆశ నిరాశగా మారినా – నిరాశ నిస్పృహ పెంచినా
యుక్తి తెలియక తిరిగినా – శక్తి క్షీణించిపోయినా
వెన్ను తట్టి తండ్రిలా నిలిపి నడిపించితివి
నీవే కొండ కోటగా నిలిచి బలపరచితివి‖ నీవు తోడైయుండగా ‖
Verse
నీవు నాకు అండగా నిలచి – దారి చూపినావయ్యా
నేను నీకు మెండుగా స్తుతులు – అర్పించెదను

Related Tags

ComfortGuidance