Chorus
నీవుంటే నాకు చాలు యేసయ్యా‖ 2x ‖
నీవెంటే నేను ఉంటానేసయ్యా
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా‖ 2x నీవుంటే ‖
Verse
ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైననూ‖ 2x నీ మాట ‖
Verse
బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను
అలలు ముంచివేసినా ఆశలు అణగారినా‖ 2x నీ మాట ‖
Verse
ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా‖ 2x నీ మాట ‖
Verse
నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యమూ
నీదు కృపతో నాకేదియూ కాదిల సమానము‖ 2x నీ మాట ‖