Verse
నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను
న బలహీనతను బలముగా మార్చే దేవుడవు
నీ వాక్యమే నా జీవితాన్ని బలముగా మార్చింది
నీ సన్నిధిలో నిత్యమూ నే నిలబడుచున్నాను
Chorus
నేనేమైయున్నగాని నీ కొరకే జీవింతున్
నా స్థితిఏదైనాగాని నిన్నే ప్రకటింతున్‖ 2x నేనైతే ‖
Verse
దావీదును రాజుగా నీవే చేసావు
భూరాజులలో గానుడిగా స్థిరపరిచావు
మోషేను జనములకు దిక్సూచిగా చేసితివి
రాజుల మధ్యన మహిమతో నీవే నిలిపితివి
ఎలా వర్ణింతునయ్య నీ ప్రేమను
ఏమని వివరింతు నయ్యా నీ త్యాగము‖ 2x నేనైతే ‖
Verse
శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించితివి
నిరీక్షణనిచ్చి నాకు ఆశ్రయమిచ్చితివి
పాపభారము తొలగించి శుద్ధునిగా చేసితివి
నీ దరికి నను పిలచి నిత్యజీవమునిచ్చితివి