Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nenante Neekenduko

నేనంటే నీకెందుకో

Nenante Neekenduko

Lyricist: Guntur Raja
Verse
నేనంటే నీకెందుకో ఈ ప్రేమా
నన్ను మరచి పొవెందుకు‖ 2x ‖
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా
నన్ను విడిచిపోవెందుకు
కష్టాలలో నష్టాలలో
వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలో కడగండ్లలో
వేదనలో శోధనలో
నా ప్రాణమైనావు నీవు
ప్రాణమా.. నా ప్రాణమా‖ 2x నేనంటే ‖
Verse
నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు
నిన్ను వీడిపోయినా – నన్ను వీడిపోలేవు‖ 2x ‖
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా‖ 4x ‖
ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను‖ నేనంటే ‖
Verse
ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు
మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు‖ 2x ‖
ఎందుకింత జాలి నాపై యేసయ్యా‖ 4x ‖
ఏ బలమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను‖ నేనంటే ‖

Related Tags

PraiseWorshipLove