Verse
నేనంటే నీకు ఎంతిష్టమో
నా మంచి యేసయ్యా‖ 2x ‖
నా మీద నీకు ఎనలేని ప్రేమ‖ 2x ‖
ప్రతి క్షణము నీకే నా ఆరాధనా‖ 2x ‖
ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా
ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా‖ 2x ‖
Verse
నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో
మరి దేనిని ప్రేమించలేదు
నాకిచ్చిన స్థానం పరమందున
దూతలకు ఇవ్వలేదు‖ 2x ‖
ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి
మదిలో నిలచిన మంచి దేవుడా‖ 2x ఆరాధనా ‖
Verse
నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే
క్రయ ధనముగా ఇచ్చి
బంధింపబడిన నా బంధకాలు
సిలువ యాగముతో తెంచి‖ 2x ‖
మరణించవలసిన నాకై నిత్య జీవం
ప్రసాదించిన మంచి దేవుడా‖ 2x ఆరాధనా ‖