Verse
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను‖ 2x ‖
నిత్యము నా కీర్తి నా నోట నుండును‖ 2x ‖
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా‖ 2x నేనెల్లప్పుడు ‖
Verse
కలిమి చేజారి నను వంచినా
స్థితిని తలకిందులే చేసినా‖ 2x ‖
రెండింతలుగా దయచేసెదవని‖ 2x ‖
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా‖ మేలైనా ‖
Verse
పరుల ఎగతాళి శృతి మించినా
కలవరము గుండెనే పిండినా‖ 2x ‖
నా మొఱ విని కృప చూపెదవని‖ 2x ‖
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా‖ మేలైనా ‖
Verse
శ్రమలు చెలరేగి బెదిరించినా
ఎముకలకు చేటునే తెచ్చినా‖ 2x ‖
ఆపదలలో విడిపించెదవని‖ 2x ‖
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా‖ మేలైనా ‖