Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nenemaina Prabhuva

నేనేమైనా ప్రభువా

Nenemaina Prabhuva

Lyricist: Shyam Vedala
Verse
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను‖ 2x ‖
నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా‖ 2x ‖
నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా‖ 2x నేనేమైనా ‖
Verse
లేక లేక వృద్ధాప్యమందు
ఏకైక కుమారుని ఇచ్చింది నీవే‖ 2x ‖
ఇచ్చిన నీవే బలి కోరగా‖ 2x ‖
తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా‖ నేనేమైనా ‖
Verse
సర్వము పోయి శరీరము కుళ్ళిన
నా అనువారే వెలివేసినా‖ 2x ‖
ఆప్తులంతా శత్రువులైనా‖ 2x ‖
అంతము వరకు సహియించిన ఆ యోబులా‖ నేనేమైనా ‖
Verse
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైనా అది నాకెంతో మేలే‖ 2x ‖
ఇదిగో నేను ఉన్నానయ్యా‖ 2x ‖
దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా‖ నేనేమైనా ‖

Related Tags

WorshipCommitmentSurrender