Verse
నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయసీమ
Verse
నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పోందుకోరి నీ స్నేహితుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును
Verse
నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయెనే
నా తనువందున శ్రమలుసహించినీ వారసుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును
Verse
నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చేందెద
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును