Verse
నేను కూడా ఉన్నానయ్యా
నన్ను వాడుకో యేసయ్యా‖ 2x ‖
పనికిరాని పాత్రనని
నను పారవేయకు యేసయ్యా‖ 2x ‖
Verse
జ్ఞానమేమి లేదుగాని
నీ సేవ చేయ ఆశ ఉన్నది‖ 2x ‖
నీవే నా జ్ఞానమని‖ 2x ‖
నీ సేవ చేయ వచ్చినానయ్య‖ 2x నేను ‖
Verse
ఘనతలొద్దు మెప్పులొద్దు
ధనము నాకు వద్దే వద్దు‖ 2x ‖
నీవే నాకు ఉంటే చాలు‖ 2x ‖
నా బ్రతుకులోన ఎంతో మేలు‖ 2x నేను ‖
Verse
రాళ్లతో నన్ను కొట్టిన గాని
రక్తము కారిన మరువలేనయ్యా‖ 2x ‖
ఊపిరి నాలో ఉన్నంత వరకు‖ 2x ‖
నీ సేవలో నేను సాగిపోదునయా‖ 2x నేను ‖
Verse
మోషే యెహోషువాను పిలిచావు
ఏలీయా ఎలీషాను నిలిపావు‖ 2x ‖
పేతురు యోహాను యాకోబులను‖ 2x ‖
అభిషేకించి వాడుకున్నావు‖ 2x నేను ‖