Chorus
నేను కూడా ఉన్నానయ్య
నను వాడుకో యేస్సయ్య ఆ.ఆ...‖ 2x ‖
పనికి రాని పాత్రననీ
నను పారవేయకు యేస్సయ్య‖ 2x ‖
Verse
జ్ఞానమేమి లేదు గాని
నీ సేవ చేయ ఆశ వున్నది ఆ.ఆ...‖ 2x ‖
నీవేనా జ్ఞాన మాని‖ 2x ‖
నీ సేవ చేయ వచ్చినానయా‖ 2x ‖
Verse
ఘనతలోద్దు మెప్పులోద్దు....
ధనము నాకు వద్దే వద్దు‖ 2x ‖
నీవే నాకు ఉంటే చాలు‖ 2x ‖
నా బ్రతుకులోన్న ఏంతో మేలు‖ 2x ‖
Verse
రాళ్ళతో నాను కొట్టిన గాని
రక్తము కారిన మరువలేనైయా ఆ.ఆ..‖ 2x ‖
ఊపిరి నాలో ఉన్నంత వరకు‖ 2x ‖
నీ సేవలో నేను సాగిపోదునయా‖ 2x ‖
Verse
మోషే యేహోషువను పిలిచావు.. ఏలియ ఏలిషాను నిలిపావు ఆ.ఆ.‖ 2x ‖
పేతురు యెహను యాకోబులను‖ 2x ‖
అభిషేకించి వాడుకున్నావు‖ 2x ‖