Verse
నేను నిన్ను ఎన్నడు విడువను - నేను నిన్ను ఎన్నడు ఎడబాయను
Verse
తన గర్భమున పుట్టిన పిల్లలను కరుణింపక తల్లి మరచునా ?
వారైన పిల్లలను మరతురు గాని నేను నిన్ను ఎన్నడు మరువను
Verse
నీ దుఃఖములో నేను దుఃఖించుచు వాటిని భరింతున్
నీ ఆనందములలో నేను ఆనందించుచు నీతో కలసి ఉల్లసింతును
Verse
యుగసమాప్తి వరకు మీతో కూడ ఉండి ఆత్మతోడ నడిపింతున్
కనుపాపవలె నిన్ను సురక్షితుని చేసి దుష్టత్వము నుండి కాపాడెదన్
Verse
నీవు నన్ను ఘనపరచి భయముతోడ నడచి యధార్థత చూపితివి
కావున దీవెనల ఊట నీ పై కుమ్మరించి
నా దక్షిణ హస్తముతో ఆదుకొందును