Verse
నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
Verse
నేను ఓడిపోనయా – నా పక్షానుండగా
నేను కృంగిపోనయా – నీవు నా తోడుండగా‖ 2x ‖
నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా‖ 2x ‖
నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా‖ 2x నేను ఓడిపోనయా ‖
Verse
అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే
వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే‖ 2x ‖
ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే‖ 2x ‖
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే‖ నేను ఓడిపోనయా ‖
Verse
నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే
నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే‖ 2x ‖
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే‖ 2x ‖
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే‖ నేను ఓడిపోనయా ‖
Verse
నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే
నన్ను దూషించిన చోటే దీవించినావే‖ 2x ‖
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే‖ 2x ‖
శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే‖ నేను ఓడిపోనయా ‖