Verse
నేను పిలిస్తే పరుగున విచ్ఛేస్తారు
నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది‖ 2x నేను పిలిస్తే ‖
Verse
నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు
అల కరుణతో నన్ను నడిపిస్తారు‖ 2x ‖
శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది‖ 2x నేను పిలిస్తే ‖
Verse
నన్ను వెంబడించమని యేసు పిలిచారు
తానే వెలుగై నాకు మార్గమయ్యారు‖ 2x ‖
కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది‖ 2x నేను పిలిస్తే ‖