Verse
నేను తగ్గాలి యేసు - నీవే హెచ్చాలి
నేను పూర్తిగా మరుగై - నీవే కనబడాలి
ఇదియే నా ప్రార్థన - నీ చిత్తము
Verse
నేను యేసుతో కూడ - సిలువ వేయబడాలి
నా స్వార్థ జీవితమంతా - లయమైపోవాలి
యేసుని స్వభావమునాలో - అధికమౌతు ఉండాలి
పరలోక జీవమునాలో అభివృద్ధి చెందాలి
Verse
ఆదాము పాపమునాలో - వశియించియుండగా
యేసుని రక్తమోదాని - నశియింపచేయును
ఆటంకమేమియు లేక - జీవధారలుండాలి
యేసుని జీవమునాలో - నింపబడుతుపోవాలి
Verse
ప్రాచీన స్వభావమంత - సిలువ్ వేయబడాలి
దాని ప్రభావమంత - లయమై పోవాలి
అన్నిటిలో పాత స్వభావం - తొంగి తొంగి చూస్తుంది
ప్రతిదినము యేసుప్రభువే - నాలో వృద్ధి చెందాలి
Verse
ఇహలోక కోరికలన్ని - సిలువవేయబడాలి
ప్రభువైన యేసుకునాలో - ప్రథమ స్థానముండాలి
శరీరేచ్ఛలన్ని మృతమై - ఆత్మీయతరావాలి
ఆత్మీయ జీవము నాలో - అభివృద్ధి చెందాలి
Verse
లోకమంతయునాకై - సిలువ వేయబడాలి
లోకముకై నేను కూడ - మృతమై పోవాలి
కాదు లోకం యేసేనాలో - ఘనపరచబడాలి
ఆశలన్నినావి యేసులో - దాగిపోయి ఉండాలి
Verse
నా శేష జీవితమంతా - యేసుకే సమర్పితమై
ఆయన మహిమా స్వరూపం - పొంది మార్పు చెందాలి
ఒకదినాన యేసుని రూపం - నాలో కనబడాలి
మెట్టు మెట్టుకు ఆయన పోలిక - నాలో ఏర్పడాలి