Verse
నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను‖ 2x నేను ‖
Verse
కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున‖ 2x ‖
గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‖ 2x ‖
Verse
జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు‖ 2x ‖
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‖ 2x ‖
Verse
విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు‖ 2x ‖
సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‖ 2x నేను ‖