Chorus
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును‖ 2x ‖
శోధించబడిన మీదట - నేను సువర్ణమై మారెదను‖ 2x ‖
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును
Verse
కడలేని కడలి తీరము - యెడమాయె కడకు నా బ్రతుకున‖ 2x ‖
గురిలేని తరుణాన వేరువగా - నా దరినే నిలిచేవా నా ప్రభూ‖ 2x ‖
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును
Verse
జలములలో బడి నేను వెళ్ళినా - అవి నా మీద పారవు‖ 2x ‖
అగ్నిలో నేను నడచినను - జ్వాలలు నను కాల్చజాలవు‖ 2x ‖
నేను వెళ్ళే మార్గము - నా యేసుకే తెలియును
Verse
విశ్వాస నావ సాగుచూ - పయనించు సమయాన నా ప్రభూ‖ 2x ‖
సాతాను సుడిగాలి రేపగా - నా యెదుటే నిలిచేవ నా ప్రభు‖ 2x ‖