Chorus
నేను వెళ్ళెదను మీరు ప్రార్థనలో నుండుడి
దేవుని వాక్యమును పాటించు చుండుడి
నేను వెళ్ళుచున్నాను
Verse
దేవుని వాక్యమే మీ జీవాహారము
ఎల్లప్పుడు ధ్యానించి స్తుతించుచు నుండుడి
Verse
నలుగురు ఎక్కడ కలిసి యుండెదరో
నన్ను మరువక ధ్యానించుచుండుడి
Verse
వెరువక నిలువుము ఎట్టి బాధలలో
మరువక మీరు ప్రార్థించు చుండుడి
Verse
హింసించబడినను హింసింపకుడి
కీడుకు బదులుగా మేలు చేయుచుండుడి
Verse
మిమ్మును కొనిపోవ త్వరగా వచ్చెదను
ముచ్చటించుడి నారాకను గూర్చి
Verse
ప్రేమతో ప్రాణము నర్పించితిని
ఈ ప్రేమనే సదా ధ్యానించు చుండుడి