Chorus
నేను వెళ్ళేమార్గము నాయేసుకే తెలియును‖ 2x ‖
శోదింప బడిన మీదట నేను సువర్ణమై మారెదను‖ 2x ‖
హల్లేలూయా. . .హల్లేలూయా. . .హల్లేలూయా. .ఆమేన్‖ 2x ‖
Verse
కడలేని కడలి తీరము ఎడమాయె కడకు నా బ్రతుకున
గురిలేని తరుణాన వెరవగ నా దరినే నిలిచేవా నా ప్రభు
Verse
జలములలో బడి నే వెళ్లినా అవి నా మీద పారవు
అగ్నిలో నేను నడచినా జ్వాలలు నను కాల్చజాలవు
Verse
విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు
సాతాను సుడిగాలి రేపగా నాయెదుటేనిలిచేవా నా ప్రభు