Verse
నేనునూ నా ఇంటి వారును
యెహోవాను సేవించెదము
ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని‖ 2x ‖
సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని‖ నేనునూ ‖
Verse
శ్రమలో శోధనలో మరణ బంధకంలో
శాంతి సమాధానం దయచేసి దేవుడు‖ 2x ‖
ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో‖ 2x ‖
ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు‖ 2x నేనునూ ‖
Verse
ఏ పాపము నన్ను ఏలనీయని వాడు
ఏ అపాయమును రాకుండా కాపాడును‖ 2x ‖
కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు‖ 2x ‖
నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు‖ 2x నేనునూ ‖
Verse
దీర్ఘాయువు చేత దీవించు దేవుడు
దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును‖ 2x ‖
మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు‖ 2x ‖
మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును‖ 2x నేనునూ ‖