Chorus
నేనును నా యింటివారును నీతి సూర్యుని గొలుతుము దీనమనసును
గలిగి దేవుని దివ్యసేవను జేతుము
Verse
అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము అనవరత
మా ప్రభుని చిత్తము ననుకరింతుము పనులలో
Verse
వేదవాక్య పఠనమందు విసుగు జెందక నుందుము ఆదరంబున
దైవ చిత్తము ననుసరించుచు నడుతుము
Verse
ఆశతోడను ప్రభుని దినమును నాచరింతుము మరువక విసుకు జెందక
నాలయమునకు పిన్న పెద్దల దెత్తుము
Verse
సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రతీతో భంగ పరచెడి
పనులన్నిటి కృంగదీసెదమనిశము
Verse
ప్రేమతోడను పొరుగువారిని ప్రియులుగను భావింతుము క్షమయు
స్నేహము నేర్చి ప్రభుకడ శాంతితో జీవింతుము
Verse
శక్తిగొలది శరీరబలమును శ్రమను క్రీస్తుకు నిత్తుము భక్తితో
హృదయమును పూర్తిగ ప్రభునికే యర్పింతుము
Verse
చిన్నవారలు దైవరాజ్యపు చిఱుత వారసులంచును అన్నివేళల వారి
వృద్ధికి మిన్నగ దోడ్పడెదము
Verse
పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము శుద్ధుడగు ప్రభు క్రీస్తు
మనసును శ్రద్ధతోడను జూపుచు
Verse
జీవితంబున ప్రభుని ప్రేమా శ్శీసులను ప్రసరింతుము దివ్యజ్యోతుల
రీతి వెలుగుచు దివ్యసన్నిధి నుందుము