Chorus
నేర్చుకొనరే యేసువాడుక లనుదినము మీ బ్రతుకునందున
నేర్చుకొనిన మీరలాయన జనముగ నొప్పుదురు ఇలలో‖ నేర్చుకొనరే ‖
Verse
ఆలయ ఆరాధనలకు బోయెడియలవాటుగలిగియు చాలమారులు
ఆలయమునకు అరగిన యా ప్రభుని వాడుక‖ నేర్చుకొనరే ‖
Verse
దేవవాక్య పఠనమందున దీక్షగలిగియు మరియ సుతుడు దివ్యముగ
నా గ్రంథ పఠనము జేసినవిధంబు మీరలు‖ నేర్చుకొనరే ‖
Verse
పరమ తండ్రికి ప్రార్థనలు ప్రతివేళ జేయుట పరమవిధియని మరువకను
ప్రార్ధించి మనలను నిరతమును ప్రార్ధింపమనెను‖ నేర్చుకొనరే ‖
Verse
బీద పాపులు బాధితులు బంధింపబడిన వారి కెల్లను ఆదరము
జూపించి మేలును జేసిన విధంబు మీరలు‖ నేర్చుకొనరే ‖
Verse
సువార్త ప్రకటనజేయుట సుభాగ్యముగ దానెంచి యీ భువి సేవలో
సువార్త జాటుచు సంచరించిన యేసు వాడుక‖ నేర్చుకొనరే ‖
Verse
అక్కరలలో దన్నుజేరి మక్కువతో బ్రార్ధించి వేడిన పెక్కు జనముల
యక్కరలను జక్కగ దీర్చిన విధంబును‖ నేర్చుకొనరే ‖
Verse
దైవచిత్తము దీర్చుటయే తన ధర్మ విధిగ నెరిగి యాయన ధరణిలో నా
ధర్మమునకై మరణమొందిన విభుని మాదిరి‖ నేర్చుకొనరే ‖