Verse 1
నిబంధనా జనులం
నిరీక్షణా ధనులం
ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం
మేము నిబంధనల జనులం
యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే
మోక్షమందు చేరెదము‖ 2x నిబంధనా ‖
Verse
అబ్రాహాము నీతికి వారసులం
ఐగుప్తు దాటిన అనేకులం‖ 2x ‖
మోషే బడిలో బాలురము‖ 2x ‖
యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం
మేము నిబంధనా జనులం‖ యేసు రాజు ‖
Verse
విశ్వాసమే మా వేదాంతం
నిరీక్షణే మా సిద్ధాంతం‖ 2x ‖
వాక్యమే మా ఆహారం‖ 2x ‖
ప్రార్ధనే వ్యాయామం – అనుదినము
మేము నిబంధనా జనులం‖ యేసు రాజు ‖
Verse
అశేష ప్రజలలో ఆస్తికులం
అక్షయుడేసుని ముద్రికులం‖ 2x ‖
పునరుత్తానుని పత్రికలం‖ 2x ‖
పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం
మేము నిబంధనా జనులం‖ యేసు రాజు ‖
Verse
నజరేయుని ప్రేమ పొలిమేరలో
సహించుటే మా ఘన నియమం‖ 2x ‖
క్షమించుటే ఇల మా న్యాయం‖ 2x ‖
భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం
మేము నిబంధనా జనులం‖ యేసు రాజు ‖
Verse
క్రీస్తేసే మా భక్తికి పునాది
పునరుత్తానుడే ముక్తికి వారధి‖ 2x ‖
పరిశుద్ధాత్ముడే మా రథ సారథి‖ 2x ‖
ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి
మేము నిబంధనా జనులం‖ యేసు రాజు ‖
Verse
ఎవరీ యేసుని అడిగేవో
ఎవరోలే యని వెళ్ళేవో‖ 2x ‖
యేసే మార్గం యేసే జీవం‖ 2x ‖
యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం
నిబంధనా జనులం‖ యేసు రాజు ‖