Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nibandhanaa Janulam Nireekshanaa Dhanulam

నిబంధనా జనులం నిరీక్షణా ధనులం

Nibandhanaa Janulam Nireekshanaa Dhanulam

Verse
నిబంధనా జనులం - నిరీక్షణా ధనులం
ఘనుడగు యేసుని - సిలువ రక్తపు సంబంధులం - మేము నిబంధనా జనులం
యేసురాజు వచ్చునూ - ఇంకా కొంత కాలమే - మోక్షమందు చేరెదము‖ 2x ‖
Verse
అబ్రహాము నీతికి - వారసులం
ఐగుప్తు దాటిన - అనేకులం‖ 2x ‖
మోషే బడిలో - బాలురము‖ 2x ‖
యేసయ్య ఒడిలో - కృతార్దులం.. ప్రియ పుత్రులం - [మేము....]‖ Memu ‖
Verse
విశ్వాసమే మా - వేదాంతం
నిరీక్షణే మా - సిద్దాంతం‖ 2x ‖
వాక్యమే మా - ఆహారం‖ 2x ‖
ప్రార్ధనే మా - వ్యాయామం .. అనుదినమూ - [మేము....]‖ Memu ‖
Verse
అశేష ప్రజలలో - ఆస్తికులం
అక్షయుడేసుని - ముద్రికలం‖ 2x ‖
పునరుత్థానుని - పత్రికలం‖ 2x ‖
పరిశుద్ధాత్ముని - గోత్రికులం.. యాత్రికులం - [మేము....]‖ Memu ‖
Verse
నజరేయుని ప్రేమ - పొలిమేరలో
సహించుటే మా - ఘననియమం‖ 2x ‖
క్షమించుటే ఇల - మా న్యాయం‖ 2x ‖
భరించుటే మా - సౌభాగ్యం అదే.. పరమార్ధం - [మేము....]‖ Memu ‖
Verse
క్రీస్తేసే మా - భక్తికి పునాది
పునరుత్థానుడే - ముక్తికి వారధి‖ 2x ‖
పరిశుద్ధాత్ముడే - మా రథసారధి‖ 2x ‖
ప్రభుయేసే మా - ప్రధానకాపరి.. బహునేర్పరి - [మేము....]‖ Memu ‖
Verse
ఎవరీ యేసని అడిగేవో - ఎవరోలే యని వెళ్లేవో‖ 2x ‖
యేసే మార్గం - యేసే జీవం‖ 2x ‖
యేసే సత్యం - కాదు చోద్యం.. ఇదే మా సాక్ష్యం -[నిబంధనా....]‖ నిబంధనా ‖

Related Tags

FaithHopeCovenant