Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nibbaram Kaligi Dhairyamugundu Digulu Padaku Jadiyaku Epudu

నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎపుడు

Nibbaram Kaligi Dhairyamugundu Digulu Padaku Jadiyaku Epudu

Lyricist: Bro Anil Kumar
Chorus
నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు‖ 2x ‖
నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు
హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా......
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా......
నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు......
Verse
పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా‖ 2x ‖
ప్రభు కృప మమ్మును విడువదుగా ....
పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా
ప్రభు కృప మమ్మును విడువదుగా ....
ఎక్కలేని ఎత్తైన కొండను -ఎక్కించును మా ప్రభు కృప మమ్మును
ప్రభువే మా బలము
హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా......
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా......
Verse
మునుపటి కంటెను - అధికపు మేలును‖ 2x ‖
మా ప్రభు మాకు కలిగించును
మునుపటి కంటెను - అధికపు మేలును
మా ప్రభు మాకు కలిగించును
రెట్టింపు ఘనతకు మా తలను ఎత్తును
శత్రువు ఎదుటనే భోజనము ఇచ్చును
ప్రభువే మా ధ్వజము
హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా......
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా......
Verse
మా అంగలార్పును -నాట్యముగా మార్చెను‖ 2x ‖
బూడిద బదులు సంతోషమిచ్చెను
మా అంగలార్పును -నాట్యముగా మార్చెను
బూడిద బదులు సంతోషమిచ్చెను
దుఃఖ దినములు సమాప్తమాయెను
ఉల్లాస వస్త్రము ధరియింప జేసెను
ప్రభునకే స్తోత్రం
హల్లేలూయా........ ఆమెన్ హల్లేలూయా......
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా......
Verse
స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును‖ 2x ‖
మా ప్రభు మమ్మును మరువడుగా
స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును
మా ప్రభు మమ్మును మరువడుగా
చూడుము నా అరచేతిలోనే
చెక్కితి నిన్ను అన్నాడు ప్రభువు
ప్రభువే చూచుకొనును
హల్లేలూయా........ ఆమెన్ హల్లేలూయా......
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా......
Verse
రాబోవు కాలమున - సమాధాన సంగతులే‖ 2x ‖
మా ప్రభు మాకై ఉద్దేశించెను
రాబోవు కాలమున - సమాధాన సంగతులే
మా ప్రభు మాకై ఉద్దేశించెను
ఇదిగో నేనొక నూతన క్రియను
చేయుచున్నానని నా ప్రభువు చెప్పెను
ఇప్పుడే అది మొలుచున్
హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా......
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా......
Verse
మేము కట్టని పురములను - మేం నాటని తోటలను‖ 2x ‖
మా ప్రభు మాకు అందించును
మేము కట్టని పురములను - మేం నాటని తోటలను
మా ప్రభు మాకు అందించును
ప్రాకారము గల పట్టణము లోనికి
ప్రభువే మమ్మును నడిపింపజేయును
ప్రభువే మా పురము
హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా......
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా......
Chorus
నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు
నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు
హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా......
ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము
ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము
హల్లేలూయా.... ఆమెన్ హల్లేలూయా......

Related Tags

FaithVictoryProtectionCourage