Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nibbaramutho Naa Yesuke

నిబ్బరముతో నా యేసుకే

Nibbaramutho Naa Yesuke

Lyricist: P Satish Kumar
Verse
నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా
వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా‖ 2x ‖
యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా
యేసయ్యా… యేసయ్యా… మాహిమ ఘనతలు నీకయ్యా‖ 2x నిబ్బరముతో ‖
Verse
కష్టకాలమందు నాకు – కనికరము చూపెను
కాలుజారుతున్నవేళ – కరుణతో నిలిపెను‖ 2x ‖
కడుపు కాలుతున్నవేళ – నా కడుపు నింపెను
కన్నిటి బ్రతుకును – నాట్యముగా మార్చెను
కఠినమైన కాలములో – నా చెంత నిలిచెను‖ యేసయ్యా ‖
Verse
దిక్కుదెసలేని నాకు – దర్శనము నిచ్చెను
ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను‖ 2x ‖
దిక్కుతోచని వేళ – నా దిక్కై నిలిచెను
దుష్ట శక్తులన్నిటిని – నాకు దూరపరచెను
దీవెనలు కుమ్మరించి – ధన్యునిగా చేసెను‖ యేసయ్యా ‖

Related Tags

PraiseWorshipThanksgiving