Verse
నిదురఁ బోయినట్టి నీ పాద సేవకుని సదయుఁడగు తండ్రి చక్కగా
దాచు సదమలంబగు లోకమున నీ సదనమందునఁ జేర్చి శుద్ధుల
వదల కెప్పుడు వారితో నీ పదయుగంబుల సేవఁగోరుచు‖ నిదురఁ ‖
Verse
ఇతఁడీలోకమందు నీవొసంగిన పని హితమతి నొనరించె యేసుని
కృపను సతతమును బాపంబుతోడను జాల యుద్ధ మొనర్చి బ్రదుకును
నతిముదంబున నీకు నిరతము నుతు లొనర్చెడు నాశఁబూనుచు‖ నిదురఁ ‖
Verse
సన్నిధిఁ జేరిన సకల వరభక్తుల కన్నీరు దుడుతువు కరుణ మీరంగ
నిన్ను నమ్మినవారి నడువడి నీవు తేటగ నెఱింగా వారికి జెన్ను గను
దీర్చె దవు న్యాయము సన్నుతింపగ సజ్జనావన‖ నిదురఁ ‖
Verse
మరణ కాలంబున ధరలోఁ క్రీస్తుని సిలువ దిరముగఁ జూచిన
నరులందఱు వరదుఁడగు రక్షకుని దయచే జిరపురము నిక్కముగఁ జేరుచు
గరము నేర్తురు ప్రేమ నచ్చటఁ దరతరంబులు గడుచుచుండగ‖ నిదురఁ ‖
Verse
పరిశుద్ధుఁడగు దేవ పాదసన్నిధిలోనఁ బరిపూర్ణానందము పాదు
కొని యుండు నరక బలములు చెరుపనేరవు పరమ జనకుని సుతుల
నెమ్మదిఁ జిరదయాళుఁడు గాచు వారల నిరతమును దన యాత్మ బలమున‖ నిదురఁ ‖
Verse
యేసుబాధుని నమ్మి యిలను విడిచినవారు భాసిల్ల లేతురు ప్రభుశక్తి
నిలను భాసురంబగు దేహములు తన దాసు లందఱి కిచ్చి మోక్షని
వాసులముగాఁ జేసి వారల యాస దీర్చును మాటఁ దప్పక‖ నిదురఁ ‖