Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nija Snehithuda Naa Chelimi Kori Nee Kalimi Veedi

నిజ స్నేహితుడా నా చెలిమి కోరి నీ కలిమి వీడి

Nija Snehithuda Naa Chelimi Kori Nee Kalimi Veedi

Lyricist: Joshua Katta
Verse
నా చెలిమి కోరి – నీ కలిమి వీడి
నా చెంత చేరావు శ్రీమంతుడా
నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది
బలియాగమైన నిజ స్నేహితుడా‖ నా చెలిమి ‖
Verse
ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితిని
గమ్యమే ఎరుగనైతిని – మరణమే శరణమాయెను
ఎంతో ప్రేమించితివి – నా స్థానమందు నిలిచితివి
కృపతో నన్ రక్షించితివి – నా దోషశిక్ష భరించితివి‖ నా చెలిమి ‖
Verse
నిందలు అవమానములు – హేళనలు చీత్కారములు
కఠిన దెబ్బలు ముళ్లపోటులు – సిలువ భారం కాయమంతా గాయం
హృదినే బాధించినా – భరియించావు వేదన మౌనముగా
తనువే తల్లడిల్లినా – తృప్తినొందావు నను తలచుకొని‖ నా చెలిమి ‖
Verse
ఏ రీతి నిన్ను – కీర్తించగలను
నా నీతి నీవే ఓ యేసుదేవా
నీ సాక్షిగ నిలిచి – నీ ప్రేమను చాటి
ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా

Related Tags

Good FridaySacrificeFriendship