Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nijamaina Draakshaavalli Neevee

నిజమైన ద్రాక్షావల్లి నీవే

Nijamaina Draakshaavalli Neevee

Verse
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే‖ 2x ‖
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ
ఎనలేని నీ ప్రేమ‖ 2x నిజమైన ‖
Verse
అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా‖ 2x ‖
శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా‖ 2x నిజమైన ‖
Verse
నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా‖ 2x ‖
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా‖ 2x నిజమైన ‖
Verse
షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో‖ 2x ‖
అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో‖ 2x నిజమైన ‖

Related Tags

WorshipJesusLove