Verse
నిజముగా మొర పెట్టిన
దేవుడాలకించకుండునా
సహనముతో కనిపెట్టిన
సమాధానమీయకుండునా
జీవముగల దేవుడు మౌనముగా ఉండునా
తన పిల్లలకాయన మేలు చేయకుండునా‖ 2x నిజముగా ‖
Verse
పరలోక తండ్రినడిగిన
మంచి ఈవులీయకుండునా‖ 2x ‖
కరములెత్తి ప్రార్థించినా
దీవెనలు కురియకుండునా‖ 2x జీవముగల ‖
Verse
సృష్టి కర్త అయిన ప్రభువుకు
మన అక్కర తెలియకుండునా‖ 2x ‖
సరి అయిన సమయానికి
దయచేయక ఊరకుండునా‖ 2x జీవముగల ‖
Verse
సర్వశక్తుడైన ప్రభువుకు
సాధ్యము కానిదుండునా‖ 2x ‖
తన మహిమ కనపరచుటకు
దయ చేయక ఊరకుండునా‖ 2x జీవముగల ‖