Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nijamuga Morapettina Devudalakinchakunduna

నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా

Nijamuga Morapettina Devudalakinchakunduna

Verse
నిజముగా మొరపెట్టినా - దేవుడాలకించకుండునా ?
సహనముతో కనిపెట్టినా - సమాధానమీయకుండునా ?
జీవముగల దేవుడు - మౌనముగా ఉండునా ?
తన పిల్లలకాయన - మేలుచేయకుండునా ?
Verse
పరలోక తండ్రినడిగినా - మంచి ఈవులీయకుండునా ?
కరములెత్తి ప్రార్ధించినా - దీవెనలే కురియకుండునా ?
జీవముగల దేవుడు - మౌనముగా ఉండునా ?
తన పిల్లలకాయన - మేలుచేయకుండునా ?
Verse
సృష్టికర్తయైన వానికి - మన అక్కర తెలియకుండునా ?
సరియైన సమయానికి - దయచేయక ఊరుకుండునా ?
జీవముగల దేవుడు - మౌనముగా ఉండునా ?
తన పిల్లలకాయన - మేలుచేయకుండునా ?

Related Tags

FaithPrayerTrust