Chorus
నిజముగాఁ పరిశుద్ధు డొకఁ డీ నేలపై లేఁడు వృజినములచేఁ జెడిన
మదిని బ విత్రమూలం బెటుల బొడమును‖ నిజము ‖
Verse
దురిత లతలకు మూలకందము దుస్స్వభావము దానిఁ గూడిన
నరులలోఁ బరిశుద్ధ విధు లె న్నటికిఁ గనరావు నెరవుగా సద్ధర్మములనే
తెఱఁగుననుఁ గావింప నేర్తురు ధరణి లోపల ముసిఁడి చెట్టున చెఱకు
రస ముండునె తలంపగ‖ నిజము ‖
Verse
మనసు క్రియ లన్నిటికి మూలం బనుచు శాస్త్రము పల్కు మఱి యా
మనసు శుచిగాకున్న నగునే తనకు క్రియాశుద్ధి అనిశ మా హృదయము
దురిచ్ఛల నలరి మిధ్యాసక్తి నుండఁగ ఘనతగల సత్యార్య ముల నిల
మనుజుఁడె ట్లొ నరింపఁజాలును‖ నిజము ‖
Verse
నిరతమును పాపాగ్నిచేతను గరగుచున్న మనంబులోపల పరమ
ధర్మము భక్తి ఎటువలెఁ బాదుకొని యుండున్ నిరపరాధి యొకండు లేఁ
డని నిక్కముగఁ గనపచ్చుచున్నది పరమ దేవుఁడు క్రీస్తు కృతమునఁ
పాపులను రక్షింపవలయును‖ నిజము ‖