Verse
నింపుమో ప్రభు నన్ను - సర్వ సంసంపూర్ణతతోను నన్ను
Verse
నింపుము నీదు ఆత్మతో నన్ నింపుము సర్వ శక్తితోనన్
Verse
పరమానందముతో నింపుము నన్ - ఆత్మీయశాంతితో నింపుము నన్
Verse
నీదు మహిమతో నింపుము నన్ ఫలములతో నా జీవితమున్
Verse
నింపుము ప్రభువా జీవముతో - నింపుము ప్రేమతో నను ప్రభువా
Verse
సత్యముతో నా హృదయమును - నెనరుతో నింపుము హృదయమును
Verse
విశ్వాసముతో నింపుము నన్ నీ జ్ఞానముతో నింపుము నన్
Verse
ఊటలధారల యనుభవమున్ నదులను నన్నుండి పారనిమ్ము