Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nimpumu O Prabhuvaa Sarva Sampoornathatho

నింపుము ఓ ప్రభువా సర్వ సంపూర్ణతతో

Nimpumu O Prabhuvaa Sarva Sampoornathatho

Chorus
నింపుము ఓ ప్రభువా! సర్వ సంపూర్ణతతో
మేము నిండియుండెదము - పరిపూర్ణత నొందెదము
Verse
పాప క్షమాపణ నిచ్చి - జీవముతో నింపుము
ఆత్మీయ వరమిచ్చిన - బలముతో నిండెదము
Verse
పరమ సంతోషమిచ్చి - సమాధానంబిమ్ము
చూపించు పరలోకమహిమ - ప్రకాశముతో నింపు
Verse
ఆత్మ ఫలములతో నింపి - ప్రేమ సంతోషము
మంచితనము సాత్వీకము విశ్వాసముతో నింపు
Verse
నింపు సత్యముతో మమ్ము నిల్పు - ప్రత్యక్షతలో
నీ జ్ఞానముతో నింపిన స్తుతితో నిండెదము
Verse
పరమాశీర్వాదమిచ్చి - తప్పించు యిహమునుండి
అర్హులుగ చేయు పరమునకై - ఆశించుచున్నాము

Related Tags

HolinessPrayerSpiritual Growth