Verse
నిందలలో నిస్పృహలో
నా పక్షమై సాక్ష్యం నీవే కదా
ద్వేషముతో దూషణతో
దుష్టుల వలలెన్నో నను పొంచిఉండగా
ఒక్క మాట సెలవిచ్చి అణిచే శక్తి నీది
నా ముందు నిలుచుండి నడిపే బలము నీది
యోసేపు దేవుడా దానియేలు దేవుడా
ఈ దీన దాసుని తప్పించ రావా
ఈ దీన దాసుని కరుణించ రావా
Verse
నేరము లేని దోషము మోపి
భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మతే
భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే
ఆ నాటి శాస్త్రుల నిందలు నిజమైతే
భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే
క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్ధమే
వడిసెలతో దుష్టుని అణచిన శక్తి నీది
చేప గర్భమునుండి తప్పించిన బలము నీది
దావీదు దేవుడా యోన దేవుడా లేఖనము
నెరవేర్చుటకై బలహీనుడువైతీవ
Verse
ప్రేమకు ప్రతిగా పగవారైతే పౌలుకు
మిగిలింది అంతులేని గాయమే
కోరహు వాదన న్యాయమైతే
మోషే పక్షమున దేవుడే దోషియా
సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది
మోషేకీ సాక్షిగా నిలిచిన బలము నీది
పౌలు దేవుడా మోషే దేవుడా లేఖనం
స్థాపించుటకై భక్తులను విరచితివ