Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nindu Manasutho Ninnu Premintunu

నిండు మనసుతో నిన్ను ప్రేమింతును

Nindu Manasutho Ninnu Premintunu

Verse 1
నిండు మనసుతో నిన్ను ప్రేమింతును
నా పూర్ణ శక్తితో నిన్ను సేవింతును
నా సమస్తము నీకే అర్పింతును
సంపూర్ణ భక్తితో నిన్ను పూజింతును
నీతిమంతుడా నిర్మలాత్ముడా
లోకరక్షకా యేసూ . .
Verse
నీ నీడలో నన్ను నిలువనీయుము
నీ బాటలో నేను నడిచెద
నీ అత్మతో నన్ను నింపు ప్రభు
నీ సాక్షిగా నేను నిలిచెద
సజీవయాగముగా నా దేహమర్పింతును
నా బలము నా ఘనము నీకే సమర్పింతు
ఫలియింపజేయుము నన్ను
Verse
నీ నామము నేను మహిమపరచెద
నవ్యగీతిక నీకై పాడెద
సర్వసృష్టికి ఆధారభూతుడ
గంభీర ధ్వనులతో అరాధించెద
నీ నామ మాధుర్యం లోకానికి చాటిచెప్పెద
నీ ప్రేమ వాత్సల్యం అందరికి చూపించెద
మనసారా ప్రేమింతు నిన్ను

Related Tags

WorshipDevotionalSurrender