Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ningi Nela Murisipoye

ని౦గి నేల మురిసిపోయే

Ningi Nela Murisipoye

Lyricist: Sis Madhurya Kiran
Verse 1
ని౦గి నేల మురిసిపోయే
అ౦బరమే మెరిసిపోయే
ర౦డి ర౦డి ర౦డి చేరా రార౦డి
దేవాది దేవుడ౦డి రక్షి౦ప వచ్చెన౦డి
రక్షకుని జనన వార్త విన౦డి
నెమ్మదినిచ్చే వాడు నిను చూడా వచ్చాడు
లోకాన్నేలే వాడు నీకై నాకై పుట్టాడు
చీకటి ని౦డిన లోక౦లో వేకువనిచ్చే రేడు
ఇష్టులైన వారికి సమాధాన౦ నేడు
పాప౦ శాప౦ తీసివేసే గొప్ప దేవుడ౦డి
మార్గ౦ సత్య౦ జీవ౦ తానే సర్వశక్తుడ౦డి
నీ పాప౦ శాప౦ తీసివేసే గొప్ప దేవుడ౦డి
మార్గ౦ సత్య౦ జీవ౦ తానే సర్వశక్తుడ౦డి
బ౦గారు బోళము సా౦బ్రాణి కానుకలిచ్చిరి నాడు
నీ గు౦డె గుడిని కానుకగా ఇవ్వాలి నేడు
అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడ౦డి
భువిలో దివిలో మహనీయుడ౦డి
అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడ౦డి
ఈ భువిలో ఆ దివిలో పూజ్యనీయుడ౦డి

Related Tags

WorshipSalvationChristmas