Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ningilo Devudu

నింగిలో దేవుడు

Ningilo Devudu

Lyricist: Jaladi
Verse
నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు‖ 2x ‖
చెంత చేరి సంతసించుమా‖ 2x ‖
స్వంతమైన క్రీస్తు సంఘమా‖ నింగిలో ‖
Verse
పాపాల పంకిలమై శోకాలకంకితమై
మరణించి మన కోసం కరుణించి ఆ దైవం‖ 2x ‖
దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై‖ 2x ‖
జన్మించె నీ కోసం ధన్యము చేయగా‖ 2x నింగిలో ‖
Verse
సాతాను శోధనలే శాపాల వేదనలై
విలపించే దీనులకై అలరించు దీవెనలై‖ 2x ‖
శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ‖ 2x ‖
గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల‖ 2x నింగిలో ‖

Related Tags

WorshipGospelJesus