Verse
నింగిలోన తారక
చేయ వచ్చింది వేడుక
దారి చూపేందుకు తోడుగా
తానే నడిచింది ముందుగా
బెత్లహేములో పండుగ
వెలుగే వచ్చింది నిండుగా
రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా
Verse
దూత వార్త వినగానే గొల్లలు
అందరికి చాటారు శుభములు
సువార్త మతికి రాగానే జ్ఞానులు
మోకరించి ఇచ్చారు కానుకలు
కదలిరా సువార్త చాటగా
ప్రభువిచ్చెను మన భాద్యతగా
రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా‖ 1x ‖
Verse
లోకమునే రక్షించిన ఈ దినము
నీ హృదయములో రావాలి నిత్యము
ప్రభు యేసే దేవుడనే సత్యము
నమ్మి మోకరించాలి ఈ క్షణము
తన రక్తమే శుద్ధి చేయును
మన పాపములు రద్దు చేయును
రక్షకుడు మన కొరకే ఉదయించెనుగా‖ 1x ‖