Chorus
నింగిలోని చందురుడా - మంద కాచే ఇందురుడా‖ 2x ‖
నిందలేని సుందరుడా - గంధమొలికే చందనుడా‖ 2x ‖
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - వెన్నలాంటి మనసు నీదయ్యా‖ 2x ‖
Verse
ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా - గాయాలు నిన్ను బాధిస్తున్నా
దాహంతో నోరు ఎండిపోతున్నా - నాలుక అంకిట అంటిపోతున్నా
ప్రేమతో పెంచిన - మమతలు పంచినా - నీ శ్రమ చూడలేక గుండెపగిలిన
తల్లిని శిష్యునికప్పగించి - నీ బాధ్యతను నెరవేర్చినావా ?‖ 2x ‖
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత ప్రేమామూర్తి నీవయ్యా‖ 2x ‖
Verse
అందాల మోముపై ఉమ్మివేయగా - నీదు గడ్డము పట్టి పీకగా
యూదులరాజని అపహసించగా - సిలువ దిగిరమ్మని పరిహసించగా
అంతా సహించి - మౌనం వహించి - బాధించువారిపై ప్రేమ చూపించి
ఏమిచేస్తున్నారో ఎరుగరు - క్షమించుమని ప్రార్ధించినావా ?‖ 2x ‖
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత సహనం చూపినావయ్యా‖ 2x ‖
Verse
లేతమొక్కలాంటి నీ దేహముపై - కొరడాలెన్నో నాట్యముచేయగా
మేలే చేసినా కరుణను పంచినా - కాళ్లూ, చేతులలో శీలలుకొట్టగా
అంతటి శ్రమలో - చెంతననిలిచి - చింతతో ఉన్న అతివల జూచి
నాకోసం ఏడ్వవలదని - పలికి వారిని ఓదార్చినావా ?‖ 2x ‖
ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత కరుణామయుడ నీవయ్యా‖ 2x ‖