Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ningiloni Chanduruda Mandagache Induruda

నింగిలోని చందురుడా మందగాచే ఇందురుడా

Ningiloni Chanduruda Mandagache Induruda

Chorus
నింగిలోని చందురుడా మందగాచే ఇందురుడా
నిందలేని సుందరుడా గంధమొలికె చందరుడా
ఓ...... వెన్నెలంటి చల్లని రాజా
వెన్నలాంటి మనసు నీదయ్యా
Verse
ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా గాయాలు నిన్ను బాధిస్తున్నా
దాహంతో నోరు ఎండిపోతున్ననాలుక అంగిట అంటిపోతున్న
ప్రేమతో పెంచిన మమతలు పంచిన నీ శ్రమ చూడలేక గుండెపగిలినా
తల్లిని శిష్యుని కప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినావా
ఓ . . వెన్నెలంటి చల్లని రాజా ఎంత ప్రేమ మూర్తి నీవయ్యా
Verse
అందాల మోముపై ఉమ్మి వేయగా నీదు గెడ్డము పట్టి లాగగా
యూదుల రాజని అపహసించగా సిలువ దిగి రమ్మని పరిహసించగా
అంతా సహించి మౌనంవ్ వహించి బాధించువారిపై ప్రేమ చూపించి
ఏమి చేస్తున్నారో యెరుగరు క్షమియించుమని ప్రార్థించినావా
ఓ . . వెన్నెలంటి చల్లని రాజా ఎంత సహనం చూపినావయ్యా
Verse
లేత మొగ్గలాంటి నీ దేహముపై కొరడాలెన్నో నాట్యము చేయగా
మేలే చేసినా కరుణను పంచినా కాళ్ళు చేతులలో చీలలు కొట్టగా
అంతటి శ్రమలో చెంతను నిలచి చింతలో వున్నా అతివల చూచి
నా కోసం ఎడ్వవలదని పలికి వారిని ఓదార్చినావా
ఓ . . వెన్నెలంటి చల్లని రాజా ఎంత కరుణామయుడ నీవయ్యా

Related Tags

SacrificeJesusPassionLove