Verse
నిన్న నేడు నిరంతరం మారనే మారవు
నా జ్ఞాపకాలలో చెరగని వాడవు‖ 2x ‖
నీవే నీవే నమ్మదగినా దేవుడవు
నీవు నా పక్షమై నిలిచేయున్నావు‖ 2x ‖
Verse
యేసయ్యా నీ ప్రత్యక్షతలో
బయలుపడెనే శాశ్వతా కృప నాకై‖ 2x ‖
విడువదే నన్నెల్లప్పుడూ కృప
విజయపథమున నడిపించెనే కృప‖ 2x ‖
విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు‖ నిన్న ‖
Verse
యేసయ్యా నీ కృపాతిశయము
ఆదరించెనే శాశ్వత జీవముకై‖ 2x ‖
మరువదే నన్నెల్లప్పుడూ కృప
మాణిక్య మణులను మరిపించేనే కృప‖ 2x ‖
మైమరచితినే నీ కృప తలంచినప్పుడు‖ నిన్న ‖
Verse
యేసయ్యా నీ మహిమైశ్వర్యము
చూపెనే నీ దీర్ఘశాంతము నాపై‖ 2x ‖
ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప
శాంతి సమరము చేసెనే కృప‖ 2x ‖
మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే‖ నిన్న ‖