Verse
నిన్న నేడు రేపు మారని దేవుడు నీవు
మనుషులు మారిన మమతల తరిగిన
మార్పులేని దేవుడు నీవ్‖ 2x ‖
Verse
అబ్రహామును పిలిచావు యాకోబును దర్శించావు
తరగని ప్రేమతో కృపతో నింపి మెండుగా దీవించావు
ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు
Verse
యోసేపును హెచ్చించావు దావీదును ప్రేమించావు
శ్రమలోనైనా ధైర్యము నింపి సర్వము సమకూర్చావు
ఈనాటికైనా, ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు
Verse
జీవపు మార్గము చూపించి ఆశ్రయ పురముకు నడిపించి
నీ దయ నాపై కురిపించి నెమ్మది కలిగించావు
ఈనాటికైనా, ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు